Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 AM

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

01-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అంగరంగ వైభవంగా ఐదు రోజుల పండగ

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఈ నెల ముప్పైవ తేదీన ప్రారంభమైన దోమకొండ ఊర పండగ మూడో రోజుకు చేరుకుని భక్తుల జనజాతరతో కిటకిటలాడుతోంది. ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఊర పండగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.దోమకొండ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పండగకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. గ్రామంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన దోమకొండ బురుజు కోటతో పాటు ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, అగ్రహారం పోచమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, కట్ట మైసమ్మ ఆలయాల వద్ద భక్తుల రద్దీతో సందడి నెలకొంది.ఊర పండగ నిర్వహణకు ఆలయాల వద్ద, బురుజు ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. స్థానిక బురుజు కోట వద్ద రంగసానితో రంగమెక్కించి భవిష్యవాణి వినిపించడం భక్తులను ఆకట్టుకుంది. గ్రామ పొలిమేరలో సరుగుచల్లి, అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నాటి నృత్యాలతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కనులవిందుగా సాగాయి. ఊర పండగ జాతరను తలపిస్తూ దోమకొండ గ్రామం మొత్తం భక్తిభావంతో మునిగిపోయింది.ఫిబ్రవరి రెండో తేదీన ఊరడమ్మకు చేయడం, మూడో తేదీన కట్ట మైసమ్మకు చేయడం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య, దోమకొండ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

దోమకొండలో భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News