Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

డివైడర్‌ను ఢీకొట్టిన కారు: క్యాటరింగ్ యజమాని మృతి

05-05-2026 209 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తూప్రాన్‌పేట వద్ద ప్రమాదం.. మరో నలుగురికి గాయాలు

సినిమా షూటింగ్‌ పనులకు వెళ్తుండగా విషాదం

నిర్మాణంలో ఉన్న డివైడర్‌ను కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా, మరో నలుగురు గాయపడ్డారు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కృష్ణానగర్‌లో నివసించే రుద్రరాజు వీర వెంకటరామరాజు (40) సినిమా షూటింగ్‌లకు క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. మంగళవారం ఉదయం ఆయన తన టీమ్ సభ్యులు నాయుడు, రామకృష్ణ, రమేష్ కుమార్, శ్రీనివాసరాజులతో కలిసి టయోటా క్వాలిస్ కారులో (AP37 AG 3999) హైదరాబాద్ నుండి మల్కాపురం వైపు బయలుదేరారు.​ కరీంనగర్‌కు చెందిన తిప్పని శ్రీకర్ వాహనాన్ని నడుపుతుండగా, ఉదయం 6:10 గంటల సమయంలో తూప్రాన్‌పేట గ్రామ పరిధిలోని కొత్త బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చున్న వెంకటరామరాజు తలకు తీవ్ర గాయమైంది. వాహనంలోని మిగతా నలుగురికి పలుచోట్ల గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో అబ్దుల్లాపూర్ మెట్ లోని మనోజ్ఞ ఆస్పత్రికితరలించారు.వెంకటరామరాజను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి తమ్ముడు గుంటూరు సాయి రవి వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

డివైడర్‌ను ఢీకొట్టిన కారు: క్యాటరింగ్ యజమాని మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News