Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర

02-05-2026 380 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు పూర్తయ్యిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. గత ఏడాదిలోనే గ్యాస్ ధరలు మూడుసార్లు పెరిగి రూ.993కు చేరుకోవడం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ధరల పెరుగుదలతో జీవన వ్యయం పెరిగి సామాన్యుల జీవితం దుర్భరమవుతోందని పేర్కొన్నారు.

ప్రధాని గతంలో గ్యాస్ ధరలు పెరగవని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉజ్వల యోజన పేరుతో ప్రచారం చేసిన బీజేపీ నాయకులు పెరిగిన ధరలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News