Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

ధరల పెరుగుదలపై 10న కలెక్టరేట్ ముట్టడి

ధరల పెరుగుదలపై 10న కలెక్టరేట్ ముట్టడి

ధరల పెరుగుదలపై 10న కలెక్టరేట్ ముట్టడి
08-06-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీపీఐ నేత పల్లె శేఖర్ రెడ్డి మండిపాటు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతూ సామాన్యుడి బతుకును భారంగా మార్చిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. అధిక ధరలను నిరసిస్తూ ఈ నెల 10న చేపట్టే కలెక్టరేట్ ముట్టడి (ధర్నా) కరపత్రాలను సోమవారం చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ముగియగానే నెలలో మూడుసార్లు ఇంధన ధరలు పెంచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ధరల పెరుగుదలను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ కు పాల్పడుతున్న అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10న జరిగే ధర్నాను ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ చౌటుప్పల్ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు పిల్లి శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, ప్రముఖ నాయకులు టంగుటూరు రాములు, దాసరి అంజయ్య, బద్దుల సుధాకర్, దాసరి యాదయ్య, ఉబ్బు సుదర్శన్, డి. కృష్ణ, శంకర్ బాబు, డి. మనోహర్, చింటు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధరల పెరుగుదలపై 10న కలెక్టరేట్ ముట్టడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News