Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

05-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ :

రైతులు మార్కెట్లలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్లలో ధాన్యం పోసి నెలరోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని అన్నారు.

తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, లారీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరారు. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.

రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి.సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు

Article Image

వలిగొండ :

రైతులు మార్కెట్లలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సిపిఎం నాయకుడు గాజుల ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మార్కెట్లలో ధాన్యం పోసి నెలరోజులు గడిచినా కొనుగోళ్లు జరగకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని అన్నారు.

తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి, లారీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని కోరారు. రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు.

రైతు ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News