Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:17 AM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి

04-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, తాలు–తరుగుడు పేరుతో రైతులను దోపిడీ చేయవద్దని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

సిరిపురం గ్రామంలో సిపిఎం నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలు, ఎండల తీవ్రతతో రైతాంగం మరింత నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని చెప్పారు.

వడ్లు పట్టేందుకు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టిన రైతులకు తాలు పేరుతో కోతలు విధించడం అన్యాయమని మండిపడ్డారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బల్గురి అంజయ్య, అంబటి మల్లారెడ్డి, కూనూరు వెంకటేశం, దాడి మల్లారెడ్డి, అంబటి సురేందర్ రెడ్డి, బైరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. తాలు, తరుగుడు పేరుతో దోపిడీ ఆపాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News