Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

30-04-2026 540 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు.

రోజుల తరబడి కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యపు కుప్పలను పరిశీలించిన ఆయన, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట పండించడం కంటే పండించిన ధాన్యాన్ని మార్కెట్‌లో అమ్ముకోవడం కష్టంగా మారిందని రైతులు వాపోయారు. వాతావరణ మార్పులతో తీవ్ర ఆందోళనలో ఉన్నామని తెలిపారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విషయంలో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమే అయినా, ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు చేయడం అనర్హమని అన్నారు. స్థానికంగా కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి, ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరిగినా, రైతులకు నష్టం కలిగినా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్దాస్ విక్రమ్, భోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోస బోయిన మల్లేశం, నాయకులు పున్న వెంకటేశం, బత్తుల వెంకటేష్, అమీర్ మందడి సాగర్ రెడ్డి, బద్దుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News