Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన! 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:55 AM

ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించండి..​

ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించండి..​

ధాన్యం తడవకుండా జాగ్రత్త వహించండి..​
May 04, 2026 06:34 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి..

అకాల వర్షాల నేపథ్యంలో కలెక్టర్లకు మంత్రుల ఆదేశం..

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ బి. చంద్రశేఖర్..

నల్లగొండ : రానున్న మూడు, నాలుగు రోజుల్లో జిల్లాలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల నేపథ్యంలో, ధాన్యం సేకరణపై సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా పరిస్థితిని అడగ్గా.. ఆదివారం సాయంత్రం నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసిందని కలెక్టర్ వివరించారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు టార్పాలిన్లు కప్పుకున్నప్పటికీ గాలుల తీవ్రతకు అవి ఎగిరిపోయి కొంత ధాన్యం తడిసిందని ప్రస్తుతం ఆ ధాన్యం ఆరిపోయిందని కలెక్టర్ మంత్రికి వివరించారు.

అప్రమత్తంగా ఉండాలి.. మంత్రుల సూచన

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మే నెల ధాన్యం సేకరణకు అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్లు వాతావరణ శాఖ నివేదికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా ఉన్నందున గన్నీ బ్యాగులు రవాణా సమస్యలు లేకుండా చూడాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శుల నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు తడవకుండా చూడాలని లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డి.ఆర్.డి.ఓ. శేఖర్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, పౌరసరఫరాలు మరియు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News