Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:13 AM

దేవాలయ భూములను పరిరక్షించాల్సిందే: నాగరాజు గౌడ్

06-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేవాలయాలకు సంబంధించిన భూములను కాపాడటం ప్రభుత్వ అధికారుల ముఖ్య బాధ్యత అని బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి తో కలిసి పట్టణంలోని బైరాగి మఠానికి చెందిన భూములను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, బైరాగి మఠం భూములపై జరిగిన అక్రమ కబ్జాల విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం కార్యాలయం, సంబంధిత శాఖలు మరియు రెవెన్యూ అధికారులకు పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

బైరాగి మఠానికి చెందిన భూములను గతంలో కొందరు రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి అక్రమంగా తమ పేర్లపై నమోదు చేసుకుని విక్రయాలు జరిపినట్లు ఆయన ఆరోపించారు. దేవాలయ భూములను ఆక్రమించిన వారెవరు అయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, బీజేపీ యూత్ వింగ్ మండల అధ్యక్షుడు రవిశంకర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేవాలయ భూములను పరిరక్షించాల్సిందే: నాగరాజు గౌడ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News