Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

డ్రగ్స్‌పై ఉక్కుపాదం అవసరం యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక నిఘా. కలెక్టర్ అనురాగ్ జయంతి

29-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన NCORD (నార్కోటిక్స్ కోఆర్డినేషన్) సమావేశంలో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు.

డ్రగ్స్‌కు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ కళాశాలలు, క్రీడా పోటీల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.

గ్రామ, వార్డు స్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలకు బలోపేతం.

విద్యాసంస్థల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు.

ప్రత్యేక క్యాలెండర్‌తో అవగాహన చర్యలు.

ఎక్సైజ్ శాఖ ద్వారా కఠిన తనిఖీలు.

జిల్లా విద్యా అధికారి ద్వారా విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక నష్టాలను వివరించాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ సరఫరా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ కాలేజీలు, ఫ్యాక్టరీలు, గ్రామాల్లో డ్రగ్స్‌పై అవగాహన సదస్సులు నిర్వహించాలని, యువత దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి, డీఈవో సత్యనారాయణ, జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ, జిల్లా వైద్యాధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్‌పై ఉక్కుపాదం అవసరం యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక నిఘా. కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News