Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

27-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం ఐకేపీ దాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్యతో కలిసి గ్రామంలో పోసిన దాన్యం రాశులను సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు పోసిన 74 దాన్యం కుప్పలకు ఇప్పటికీ కాంటాలు పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. మార్కెట్ ప్రారంభమై 15 రోజులు దాటినా రైస్ మిల్లులను కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సీజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని గుర్తు చేశారు.

వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నేబోయిన శ్రీనివాస్, నాయకులు రాదారపు మల్లేష్, బోనగిరి శ్రీనివాస్, అశోక్, సుర సత్తయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి.మేక అశోక్ రెడ్డి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News