Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేత రావెళ్ల కృష్ణారావు ధ్వజం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 07:59 AM

దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..

28-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలి కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌..

​నల్గొండ : ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులపై జిల్లా అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొని బాధితుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహించే సాధారణ ప్రజావాణిలో రద్దీ కారణంగా వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా నాలుగో శనివారం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. పెన్షన్లు, సహాయక పరికరాలు, భూ సమస్యలపై మొత్తం 74 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి సంబంధిత శాఖలకు బదిలీ చేసిన కలెక్టర్ నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జె. శ్రీనివాస్‌, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నరసింహారావు నేత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగులు వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News