Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:38 AM

చిట్యాలలో కాంగ్రెస్ ప్రచార హోరు అభివృద్ధి, సంక్షేమమే అజెండా – సీతక్క, వీరేశం

07-02-2026 307 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సంక్షేమమే కాంగ్రెస్ అజెండా

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు కోరిన సీతక్క, వీరేశం

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కోరారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌ను ఘనంగా గెలిపించాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ చిట్యాల పట్టణంలో 850 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అత్యవసరమని చెప్పారు. గత పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని విమర్శించారు. మహిళా సంఘాల డిమాండ్ మేరకు రైస్ మిల్లు అవసరమని పేర్కొన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లు వెల్లడించారు. మహిళా సంఘాల తరపున చిట్యాల పట్టణానికి రైస్ మిల్లును తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొంటూ, ఈ నెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పున్న కైలాష్ నేతతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో కాంగ్రెస్ ప్రచార హోరు అభివృద్ధి, సంక్షేమమే అజెండా – సీతక్క, వీరేశం

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News