Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

చిట్యాల హైవేపై కత్తిపోట్ల కలకలం

చిట్యాల హైవేపై కత్తిపోట్ల కలకలం

చిట్యాల హైవేపై కత్తిపోట్ల కలకలం
03-02-2026 898 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

డ్రైవర్‌పై ఆకస్మిక దాడి.. పరిస్థితి విషమం

నల్లగొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్న ఇమ్రాన్ అనే డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆకస్మికంగా కత్తితో దాడి చేశాడు.

నార్కెట్‌పల్లి వద్ద లిఫ్ట్ అడిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని ఇమ్రాన్ కారులో ఎక్కించుకున్నాడు. చిట్యాల సమీపానికి రాగానే ఆ వ్యక్తి డ్రైవర్‌పై అకస్మాత్తుగా కత్తితో దాడి చేసి, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు.

దీంతో డ్రైవర్ ప్రతిఘటించగా తీవ్ర గాయాలయ్యాయి. కత్తివేట్లతో రక్తస్రావం ఎక్కువగా కావడంతో ఇమ్రాన్ పరిస్థితి విషమంగా మారింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దుండగుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ ఘటనతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

చిట్యాల హైవేపై కత్తిపోట్ల కలకలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News