Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:25 AM

చీపురుగూడెం పాఠశాలకు నూతన ఊపు – కంప్యూటర్ అందజేత, ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

18-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు మరింత వేగం అందుకున్నాయి. ఇప్పటికే సుమారు రూ.65 వేల విలువైన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను రోటరీ క్లబ్ ద్వారా అందజేయించడంలో కీలక పాత్ర పోషించిన సి.గుడిపాడు పాఠశాల ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాసరెడ్డికి ఈసారి కంప్యూటర్ అందజేత కార్యక్రమంలో ఘన సన్మానం జరగడం విశేషంగా నిలిచింది.

పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి-1 మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందుతాయని, భవిష్యత్తులో వారు పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించగలరని అన్నారు. సేవా దృక్పథంతో ముందుకొచ్చే ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ డి. సుందరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొట్టు లక్ష్మణరావు మాట్లాడుతూ, విద్యా రంగంలో ఉపాధ్యాయుల సేవలు అమూల్యమని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు పెరగడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్తెనపల్లి రాము, బి.సిహెచ్. రాంబాబు, ఏ. చెన్నారావు, గంటా షాకీనా తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థులు, గ్రామస్తులతో కిటకిటలాడగా, కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Sthanikam

చీపురుగూడెం పాఠశాలకు నూతన ఊపు – కంప్యూటర్ అందజేత, ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News