Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు
01-05-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

చౌటుప్పల్ మండల కేంద్రంలో సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయం ముందు జెండాను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినం కోసం చేసిన పోరాటం చరిత్రాత్మకమని తెలిపారు. ఆ నిరసనల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికుల త్యాగాల ఫలితంగానే ఎర్రజెండా పుట్టిందని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికుల పోరాటం మరింత బలపడిందని, 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారని అన్నారు.కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హమాలి, ఆటో, ట్రాన్స్‌పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాలు తీసుకురావాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లకు 60 ఏళ్లు దాటిన వారికి రూ.5,000 పెన్షన్ ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, పెన్షన్ వంటి హక్కులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం తంగేడుపల్లి రోడ్డులో సిపిఐ జెండాను పగిళ్ల మోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ ముందు ఏఐటీయూసీ జెండాను సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు పాపగల శంకరయ్య ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, బద్దుల సుధాకర్, రొండీ నరసింహ, దాసరి అంజయ్య, నీల బిక్షపతి, రోషణ అంజయ్య, ఎస్.ఏ. రహమాన్, దాసరి కృష్ణ, వంటల వెంకటేష్, దాసరి మనోహర్, గుండెబోయిన నరసింహ, ఉబ్బు దర్శన్, కే. సైదులు, ఇరిగి సంజీవ, బి. యాదయ్య, ఏ. బాబు, దాసరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఘనంగా మేడే వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News