Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి

29-04-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ.. నలుగురు సభ్యుల ఎన్నిక

పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం: చైర్‌పర్సన్‌ పావని రమేష్‌ గౌడ్

చౌటుప్పల్ పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.​ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి పర్యవేక్షణలో 13 మంది కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఈ ఎన్నిక నిర్వహించారు. నిబంధనల ప్రకారం వివిధ విభాగాల నుంచి నలుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.​ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు ప్రత్యేక పరిజ్ఞానం (జనరల్):పస్తం గంగారాములు,​ప్రత్యేక పరిజ్ఞానం (మహిళా విభాగం): సందగళ్ళ విజయ,​మైనారిటీ విభాగం (జనరల్): మహమ్మద్ బాబా షరీఫ్,​మైనారిటీ విభాగం (మహిళ): షేక్ నబీబి ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సభ్యులు పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, చౌటుప్పల్ పట్టణ ప్రగతికి, పౌర సేవల మెరుగుదలకు కౌన్సిల్ సభ్యులందరూ టీమ్ వర్క్‌తో పనిచేయాలని పిలుపునిచ్చారు.​అనంతరం ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News