Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

29-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నలుగురు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన కమిషనర్

'చౌటుప్పల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం'

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని సభ్యులను ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 10 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా, 12 మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికైన నలుగురు సభ్యులకు సభలోని సభ్యులందరూ పూర్తి మద్దతు ప్రకటించారు.

ఎన్నికైన సభ్యులు వీరే:

పర్సం గంగారం,​ సందగళ్ల విజయ సతీష్,​ బాబా షరీఫ్,​ షేక్ నబీబి, జానీ బాబా ​ఎన్నికల ప్రక్రియ అనంతరం మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి​ మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా టీమ్ వర్క్ తో పనిచేస్తేనే చౌటుప్పల్‌ను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా వెనుకబడిన వార్డులపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలి. అభివృద్ధి విషయంలో నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను, ఏ సమస్య ఉన్నా నేరుగా చర్చించవచ్చు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News