Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ బాధ్యతల స్వీకరణ

02-05-2026 225 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురపాలక కార్యాలయంలో సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కమిషనర్ మున్సిపల్ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..​పట్టణ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.​ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.చౌటుప్పల్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.తొలిరోజు విధుల్లో చేరిన కమిషనర్‌ను మున్సిపల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి, పర్యావరణ హితంగా మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్య పరిస్థితులపై చైర్ పర్సన్‌తో ఆయన ప్రాథమికంగా చర్చించారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్‌గా వేంకటేశ్వర నాయక్ బాధ్యతల స్వీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News