Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

05-05-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మున్సిపల్ కమిషనర్‌కు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ వినతి

​* చిరు వ్యాపారుల ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డు సమీపంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని 5వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మార్కెట్ సౌకర్యం లేక చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మించిన మార్కెట్ భవనానికి చిన్నపాటి మరమ్మతులు చేపట్టి, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి వెంటనే వ్యాపారులకు కేటాయించాలి. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనుల వల్ల చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళి వల్ల అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ గేటు ముందు నుంచి వెనుక భాగం మీదుగా గ్రంథాలయం, మున్సిపల్ కార్యాలయం వరకు తాత్కాలికంగా రోడ్డు సౌకర్యం కల్పించాలి.​"మార్కెట్ వెనుక భాగం నుంచి రోడ్డు సౌకర్యం కల్పిస్తే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. దీనివల్ల జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గి, ప్రజలు సులువుగా మార్కెట్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి తక్షణమే ఈ ప్రక్రియను చేపట్టాలి." కొయ్యడ శేఖర్ గౌడ్

​ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను తక్షణమే ప్రారంభించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News