Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదు. నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 03:00 PM

చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్..

27-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

అక్రమ దత్తతకు పాల్పడితే కఠిన చర్యలు..

​కలెక్టరేట్‌లో దత్తత అవగాహన హెల్ప్ డెస్క్ ప్రారంభం, మే 2 వరకు సంక్షేమ వారోత్సవాలు..

నల్గొండ : పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ నెల 27 నుండి మే 2 వరకు బాలల భద్రత, రక్షణ మరియు 'మత్తు పదార్థాలకు నో చెప్పండి' అనే అంశాలపై నిర్వహిస్తున్న వారోత్సవాల వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... సంతానం లేని వారు లేదా పిల్లలను పెంచుకోవాలనుకునే వారు తప్పనిసరిగా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి చట్టపరమైన విధానాలను మాత్రమే అనుసరించాలని సూచించారు. ఎవరైనా మధ్యవర్తుల ద్వారా అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుంటే శిక్ష తప్పదని స్పష్టం చేశారు. దత్తత ప్రక్రియపై పూర్తి సమాచారం కోసం నల్గొండలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో ఉన్న బాలరక్ష భవన్‌ను లేదా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా దత్తతపై అవగాహన పెంచేందుకు కలెక్టరేట్‌తో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, నకిరేకల్, చిట్యాల, నాగార్జునసాగర్, చండూరు వంటి ప్రధాన పట్టణాల్లో జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీలు చురుగ్గా పని చేస్తూ ప్రజలకు చట్టబద్ధమైన దత్తతపై వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కో-ఆర్డినేటర్ బి. మహేశ్, బాలసదనం మరియు శిశుగృహ సిబ్బంది హాజరయ్యారు.

Sthanikam

చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News