Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:38 AM

చాట్రాయి మండలం లో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం – రైతులకు సమగ్ర అవగాహన ఏవో బి శివశంకర్ కూడా

16-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని అన్ని గ్రామాలలో “రైతన్న మీకోసం కార్యక్రమం” నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులు కలిసి రైతులకు అవసరమైన వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, వ్యవసాయ నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు మరియు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు పథకాల వివరాలను అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు దృష్టి సారించాలని, రైతుల తలసరి ఆదాయం పెరిగేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా వివరించారు.

వ్యవసాయ శాఖ ద్వారా డ్రిప్ సిస్టం, ఫెర్టిగేషన్ విధానాల వల్ల కలిగే ప్రయోజనాలు, డ్రోన్ సాంకేతికత ద్వారా పంట సంరక్షణలో పొందే లాభాలు, వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులు వంటి అంశాలపై రైతులకు వివరంగా సూచనలు అందిస్తున్నారు. అదేవిధంగా రైతులను కేవలం ఉత్పత్తిదారులుగా కాకుండా విలువను సృష్టించే భాగస్వాములుగా మారేలా, పెట్టుబడులు మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అవకాశాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమం మార్చి 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహించబడుతుందని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆరుగొలనుపేట గ్రామంలో కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ రంగంపై పూర్తి అవగాహన పొందాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు రైతులు పుచ్చకాయల సత్యనారాయణ రెడ్డి, సీతయ్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయి మండలం లో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభం – రైతులకు సమగ్ర అవగాహన ఏవో బి శివశంకర్ కూడా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News