Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 04:07 AM

చెడు వ్యసనాలు వీడండి చదువుపై దృష్టి పెట్టండి!​

26-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

మైనర్ బాలురు తల్లిదండ్రులకు ఎస్ఐ వై. సైదులు కౌన్సిలింగ్..

అభినవ్ స్టేడియం సమీపంలో పట్టుబడ్డ వైనం..

నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు సూచన..

నల్గొండ : మైనర్ బాలురు దురలవాట్లకు లోనై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నల్గొండ టూ టౌన్ ఎస్ఐ వై. సైదులు హితవు పలికారు. పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియం సమీపంలో కొంతమంది మైనర్లు సిగరెట్లు సేవిస్తూ చెడు మార్గంలో వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టుబడ్డ బాలురకు, వారి తల్లిదండ్రులకు స్టేషన్‌లో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. స్టేడియం పరిసరాల్లో మైనర్లు సిగరెట్లు సేవిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు తనిఖీలు చేపట్టారు. అక్కడ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బాలురను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి ఎస్ఐ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.

భవిష్యత్తుపై అవగాహన..

​ఈ సందర్భంగా ఎస్ఐ సైదులు మాట్లాడుతూ.. చిన్న వయసులో సరదాగా మొదలయ్యే అలవాట్లు వ్యసనాలుగా మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి దశలో చదువుపై ఏకాగ్రత వహించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. స్నేహితుల ప్రభావంతో తప్పుడు మార్గంలో వెళ్తే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది అని బాలురను హెచ్చరించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం కన్నేసి ఉంచాలని ఎస్ఐ సూచించారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? అనే విషయాలను గమనించాలన్నారు. పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. చిన్నపిల్లలకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించే దుకాణదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు. పట్టణంలో ఎక్కడైనా మైనర్లు చెడు అలవాట్లకు లోనవుతున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఆరోగ్యకరమైన, నేరరహిత సమాజ స్థాపనే పోలీసుల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

చెడు వ్యసనాలు వీడండి చదువుపై దృష్టి పెట్టండి!​

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News