Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:57 PM

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి. రామన్నపేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం.

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి. రామన్నపేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం.

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలి.  రామన్నపేటలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం.
May 11, 2026 06:52 PM 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. కేసులో వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి బీ-టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

బాధిత బాలిక కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించి న్యాయం జరిగేలా చూడాలని, కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని, రాష్ట్ర ప్రభుత్వం బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయని, మహిళల భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. “బేటీ బచావో-బేటీ పడావో” అంటూ ప్రచారం చేసే బీజేపీ నాయకులు ఈ ఘటనపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.

ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News