Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:20 AM

బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్‌ఐ

బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్‌ఐ

బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్‌ఐ
11-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు మారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు.

సోమవారం నల్గొండ జిల్లా కార్యాలయంలో జరిగిన డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీలకు చెందిన వ్యక్తుల కుటుంబ సభ్యులు నేరాలకు పాల్పడినా ప్రభుత్వం, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

చట్టం అందరికీ సమానమైతే నిందితుడిపై వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగేలా వేగవంతమైన విచారణ చేపట్టాలని కోరారు. మహిళల భద్రతపై పెద్ద ఎత్తున మాట్లాడే పాలకులు ఇలాంటి ఘటనల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.

బాధితులను భయపెట్టి నిందితులను కాపాడే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా యువజనులు, ప్రజాసంఘాలు ఈ ఘటనపై స్పందించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్, సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా నాయకులు పోకల శశిధర్, అంజి, కార్తీక్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బండి భగీరథను అరెస్ట్ చేయాలి: డీవైఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News