Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 10:08 PM

బిజెపి12 ఏండ్ల పాలన అస్తవ్యస్తం,మునుపెన్నడు లేనంతగా ధరల భారం

బిజెపి12 ఏండ్ల పాలన అస్తవ్యస్తం,మునుపెన్నడు లేనంతగా ధరల భారం

బిజెపి12 ఏండ్ల పాలన అస్తవ్యస్తం,మునుపెన్నడు లేనంతగా ధరల భారం
June 01, 2026 07:38 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

2014లో చమురు బ్యారెల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ లీటర్ రూ.72


2026 లో బ్యారెల్ ధర 96 డాలర్లుకు తగ్గిన పెట్రోల్ ధర మాత్రం రూ.110


- సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్


కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన అనేది అస్తవ్యస్తంగా తయారయిందని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ అన్నారు. సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని సింగన్నగూడెం బైపాస్ లో కామ్రేడ్ బట్టుపల్లి శ్రీనివాస్ 15వ వర్ధంతి సభ సందర్భంగా పార్టీ అరుణ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు కొలుపుల కృష్ణ ఆవిష్కరించగా,బీజేపీ 12 ఏండ్ల పాలన, విద్వేషం,వైఫల్యాలు అనే అంశంపై సెమినార్ ను సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య అధ్యక్షతన నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ బిజెపి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పైన అధిక భారాలు మోపుతూ పాలన కొనసాగిస్తుందని, మునుపెన్నడూ లేనంతగా ధరలకు హద్దే లేదనిన్నారు. 2014లో చమురు బ్యారల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ లీటర్ రూ.72 ఉన్నదని, 2026లో బ్యారెల్ ధర 96 డాలర్లకు తగ్గిన పెట్రోల్ ధర మాత్రం రూ. 110 ఉందనిన్నారు. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ రాష్ట్రాల విధించే వ్యాట్ డీలర్ల కమిషన్ మొత్తం కలిపి ప్రజలకు భారం అవుతుండగా, పేద,మధ్యతరగతి ప్రజలపై 20 రోజుల కాలంలోనే లీటర్ కు రూ.8 పెరిగిందన్నారు. దాంతోపాటే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానికి అందేటట్లు ధరలు పెంచుతున్నారనిన్నారు. దేశంలో బిజెపి పాలన ఎలా ఉన్నదని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని వారు అన్నారు. దేశంలో నిరుద్యోగం14.8 శాతం ఉన్న కేంద్రానికి చలనం లేదని, 2014లో డాలర్ విలువ 58 రూపాయలు ఉంటే నేడు 96 రూపాయలకు దిగజారిందని ,దీనికి కారణం బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే అన్నారు. బిజెపి పాలనలో రైతాంగం ఇబ్బందుల పాలయ్యారని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు,విత్తన చట్టం,వాణిజ్య ఒప్పంద చట్టం వంటివి రైతుల బ్రతుకులను ఆగం చేస్తున్నాయని అన్నారు. లేబర్ కోర్స్ ద్వారా 12 గంటల పనికి ద్వారం తెరిచారని ఈ చట్టం కార్మికుల శ్రమను దోపిడీ చేసేటట్లు ఉన్నదని ఉన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం జి రామ్ జి పేరుతో కొత్త చట్టం తెచ్చిందని ఈ చట్టంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రెండువేల కోట్లు రూపాయలు అదనపు భారం పడుతుందని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి మత విద్వేషాలు తీవ్రంగా పెరిగాయని,భారత రాజ్యాంగాన్ని మార్చి లౌకిక ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే కుట్ర తీవ్రంగా జరుగుతుందని వారు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఎండగట్టాలని,ప్రజలు అప్రమత్తమై బిజెపి కుట్రలను తిప్పికొట్టేటట్టు పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ,బట్టుపల్లి అనురాధ,సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ శ్రీనివాస్,బీఎస్పీ నాయకులు బట్టు రామచంద్రయ్య 26వ వార్డు కౌన్సిలర్ చీమల రాజు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్,కల్లూరి మల్లేశం,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ,దయ్యాల నరసింహ,సిరిపంగి స్వామి,గడ్డం వెంకటేష్, పి.ఎం.సి నాయకులు సురుపంగ శివలింగం సిపిఎం నాయకులు బందెల ఎల్లయ్య,ఎదు నూరి మల్లేశం,వనం రాజు,కల్లూరి నాగమణి,ఈర్లపల్లి ముత్యాలు,లావుడియా రాజు,వడ్డబోయిన వెంకటేశం,బర్ల వెంకటేశం,వల్దాస్ వెంకటేష్,దండు పద్మారావు,ఆడెపుగిరి,దండు యాదగిరి,మాయ రాణి,ఈర్ల రాహుల్,బట్టుపల్లి నవీన్,మాయ రాణి గంధ మల్ల బాలమణి,కొత్త లలిత,మాటూరి కవిత,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News