Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

భువనగిరిలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.

14-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడని అన్నారు. చిన్ననాటి నుండి అనేక కష్టాలు, వివక్షలు ఎదుర్కొన్నప్పటికీ విద్యపై ఆసక్తిని కోల్పోకుండా ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి మార్గదర్శకుడయ్యారని పేర్కొన్నారు. విద్య, సామాజిక చైతన్యం ద్వారానే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యమని స్పష్టం చేశారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని, యువత విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని తెలిపారు. ఆయన ఆశయాలను అనుసరిస్తూ సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితి, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీ వాణి, వైస్ చైర్మన్ మంజుల, ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సంఘ నాయకులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News