Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:14 AM

భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి దేవాదాయ కమిషనర్‌కు వినతి

04-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధిలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.

దేవస్థానం పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కొండ వెనుక భాగంలోని తమ భూములను ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పగించినట్టు వారు తెలిపారు. ఆ సమయంలో దుకాణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా అవి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములకు పరిహారం అందించినప్పటికీ జీవనోపాధి కోల్పోయామని పేర్కొన్నారు.

ప్రస్తుతం అనేక మంది రైతులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారని, కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ భూములపై దేవస్థానం వ్రత మండపాలు, అన్నదాన సముదాయం, పార్కింగ్ స్థలాలు వంటి నిర్మాణాలు చేపట్టినా భూ నిర్వాసితులకు మాత్రం సరైన ప్రయోజనం కలగలేదని అన్నారు.

ఇప్పటికైనా తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నివాస స్థలాలు, దుకాణాల కేటాయింపు లేదా దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేకపోతే తమ కుటుంబాల జీవనం మరింత కష్టాల్లో పడుతుందని హెచ్చరించారు.

Sthanikam

భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి దేవాదాయ కమిషనర్‌కు వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News