Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

07-06-2026 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* చౌటుప్పల్‌లో నిరవధిక సమ్మె.. మద్దతు తెలిపిన సీపీఎం మున్సిపల్‌ కార్యదర్శి గోశిక కరుణాకర్

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి వాటిని వెంటనే పరిష్కరించాలని సీపీఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చౌటుప్పల్-కొండూరు రోడ్డు చౌరస్తా వద్ద చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మద్దతు ప్రకటించారు.​ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదైన కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, ప్రతి ఒక్కరికీ ఈఎస్‌ఐ కార్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రమాద బీమా, విద్యా సహాయం, ప్రసూతి ప్రయోజనాలు, వివాహ కానుకల వంటి సంక్షేమ పథకాల నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలి. నిర్మాణరంగ కార్మికులకు ఉపాధి భద్రత కల్పించడంతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా కనీస వేతనాలను పెంచి అమలు చేయాలి. కార్మికుల కుటుంబాలన్నింటికీ ఉచిత ఆరోగ్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలి.​ ప్రస్తుతం నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడం వల్ల పనులు తగ్గి, కార్మికుల జీవనం మరింత భారంగా మారింది. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, ప్రత్యేక చర్యలు చేపట్టాలి.​ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎండీ పాషా, కార్మిక నేతలు గుణముని రాములు, కలకుంట్ల శివ, నెల్లికంటి నరసింహ, సీమకండ్ల శ్రీరాములు, మాండారి మార్క్, జాజుల బిక్షపతి, గజ్జల రాజు, ఉబ్బు యాదయ్య, సుక్క యాదయ్య, సువర్ణ, దుర్గం గాలయ్య, ఉదరి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News