Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్

29-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పట్టణంలోని బీసీ నాయకుడు సుంకరి మల్లేష్ గౌడ్ నివాసంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జాతి జనగణనలో బీసీ కుటుంబాలను చేర్చకపోవడం బీసీలకు చేసిన మోసమని ఆరోపించారు. కేంద్రం రూపొందించిన ప్రశ్నావళిలో బీసీ వివరాలకు చోటు కల్పించకపోవడం అన్యాయమన్నారు. బీసీల లెక్కలు లేకుండా జరిగే జనగణన వల్ల వారికి ప్రయోజనం ఉండదని ప్రశ్నించారు.

బీజేపీ నిర్వహిస్తున్న మహిళా అగ్రహ సభలు వాస్తవానికి బీసీలకు ద్రోహ సభలేనని విమర్శించారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ఉపకోటా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ బిల్లుతో అగ్రకులాలకే అధికారం కేంద్రీకృతమవుతుందని, బీసీ మహిళలకు న్యాయం జరగదని తెలిపారు.

దేశంలో కోట్లాది బీసీ మహిళల ఆకాంక్షలను విస్మరించి కొద్దిమంది ప్రయోజనాల కోసం బిల్లు తీసుకురావడాన్ని సహించబోమన్నారు. బీసీ డిమాండ్ల సాధన కోసం గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సుంకరి మల్లేష్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, సాయిబాబా ముదిరాజ్, గూడూరు భాస్కర్, జెల్లా ఆదినారాయణ, హరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీ కులగణనపై స్పష్టత లేకపోతే మోడీ పర్యటన అడ్డుకుంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News