Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత
03-05-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-సాయి గూడెంలో ఘనంగా మేడే వేడుకలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్‌లు కార్మికులను యాజమాన్యాల ముందు బానిసలుగా మార్చడానికే దోహదపడుతున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు విమర్శించారు.ఆలేరు మండల పరిధిలోని సాయి గూడెంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 140వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ జెండాను గ్రామ కమిటీ కార్యదర్శి కొమ్మిడి గోపాల్ రెడ్డి ఎగురవేశారు.చికాగో అమర వీరులకు నివాళులు అర్పిస్తూ విప్లవ జోహార్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్,ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్,ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్ మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని దినం,ఓటు హక్కు,సమానత్వం కోసం చేసిన పోరాటం ఫలితంగా అనేక కార్మిక హక్కులు సాధించారని పేర్కొన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయని,ఇప్పటికే సాధించిన చట్టాలను బలహీనపరిచే ప్రయత్నమని విమర్శించారు.కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరింత పట్టుదలతో పోరాడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు శిఖిలం కుమారస్వామి,ఎలగందుల సిద్దులు,ఇక్కిరి శ్రీనివాస్,ఆర్.ఉదయ్‌తో పాటు పార్టీ జిల్లా,డివిజన్,గ్రామ నాయకులు ఆర్.సీత,చిరబోయిన కొమురయ్య, మారుజోడు సిద్దేశ్వర్,తమ్మడి అంజయ్య,డొంకెన శ్రీహరి,తమ్మడి రమేష్,గోవింద్ పరమేష్,కొమ్మిడి శ్రీకాంత్ రెడ్డి,కుర్రి మార్కండేయ,దార యాదగిరి,కడకంచి సత్యనారాయణ,కడకంచి రమేష్,మేకల వెంకటేష్,బైరి చంద్రయ్య,కొమ్మిడి నర్సింహారెడ్డి,కడకంచి మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీజేపీ లేబర్ కోడ్‌లపై కార్మిక వ్యతిరేకత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News