గౌస్ నగర్ గ్రామ సర్పంచ్ గీత శ్రీశైలం
భువనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామానికి సంబంధించి ఉదయం బస్ సమయమును స్కూల్ మరియు కాలేజ్ సమయానికి మార్పు చేయవలసిందిగా గ్రామంలో ఉన్న కాలేజ్ విద్యార్ధులు సర్పంచ్ ని కోరడంతో,మన సర్పంచ్ ఆ విషయము పై బస్ సమయమును మార్పు చేయాలని కోరుతూ గుట్ట డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, సర్పంచ్ భూషబోయిన గీత శ్రీశైలం యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ సందుల కృష్ణ,నాయకులు భూశబోయిన సిద్ధులు యాదవ్,గడసందుల రమేష్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, బస్ డిపో మేనేజర్ సర్పంచ్ వినతి పత్రానికి సానుకూలంగా స్పందిస్తూ సమస్యకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారికి సమయమును మార్పు చేయవలసిందిగా ఆర్డర్ ను జారీ చేయాలనీ కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి