Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:30 AM

బెల్లాపూర్, మానూర్ గ్రామాల్లో నూతన పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం

22-12-2025 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బెల్లాపూర్, మానూర్ గ్రామాల్లో ఘనంగా పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలంలోని బెల్లాపూర్, మానూర్ గ్రామ పంచాయతీల నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి పాల్గొని నూతన పాలకవర్గాన్ని అభినందించారు.

బెల్లాపూర్ గ్రామ సర్పంచ్‌గా కాజిరేశ దిగంబర్ రెడ్డి, మానూర్ గ్రామ సర్పంచ్‌గా గంపలి రమ్య సిద్ధ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో ఇచ్చిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా పాలకవర్గం బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామస్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నూతన వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బెల్లాపూర్, మానూర్ గ్రామాల్లో నూతన పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News