Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

అయిలయ్య దిష్టిబొమ్మ దహనం హరీశ్‌రావుపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం

04-05-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఆందోళన చేపట్టారు.

ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించిన పార్టీ నేతలు ‘ఖబర్ధార్ అయిలయ్య’, ‘డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన కూడలిలో అయిలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పలుమార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. హోదా మరిచి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోళ్లు మందగించాయని, ఇంకా 30 శాతం వరకు కొనుగోళ్లు పూర్తి కాలేదని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. బీర్ల అయిలయ్య వెంటనే హరీశ్‌రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ మాజీ జనరల్ సెక్రటరీ పాపట్ల నరహరి, యువజన నాయకులు ముక్యర్ల సతీష్ యాదవ్, బాలయ్య, సర్పంచ్ గడ్డం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అయిలయ్య దిష్టిబొమ్మ దహనం హరీశ్‌రావుపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News