Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి

29-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థానిక బుడెక్కల్ కార్యాలయంలో మంగళవారం కీర్తిశేషులు కామ్రేడ్ గోరుకల్లు అయ్యప్ప గౌడ్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని నియోజకవర్గ నాయకుడు బసాపురం గోపాల్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథులుగా హాజరైన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్. సుదర్శన్, పట్టణ కార్యదర్శి టి. వీరేష్, మండల కార్యదర్శి బీజీ ఎల్లప్ప, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప గౌడ్ పేదల కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు.

భూమిలేని నిరుపేదలకు దొడ్డనకేరి గ్రామంలో సొంత భూములను పంచిపెట్టిన గొప్ప వ్యక్తిగా ఆయనను కొనియాడారు. సీపీఐ తరఫున ఎంపీటీసీగా గెలుపొందడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యుడిగా, సీపీఐ పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పార్టీ అభివృద్ధికి సేవలందించారని పేర్కొన్నారు.

అయ్యప్ప గౌడ్ సేవలను మరువలేమని, ఆయన ఆశయ సాధన కోసం అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోరుకల కృష్ణమూర్తి, డీహెచ్‌పీఎస్ కార్యదర్శి విజయ్, పుష్పరాజు, రాము, దొడ్డనకేరి ఉరుకుందు, మండిగిరి శేషప్ప, అస్లాం భాషా, ఉదయ్ కిరణ్ యాదవ్, శశి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అయ్యప్ప గౌడ్ సేవలు చిరస్మరణీయం సీపీఐ నేతలు నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News