Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:23 PM

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ… నలుగురికి వెలుగులు! వివాహిత ఆత్మహత్య కథనం హృదయ విదారకం

18-03-2026 234 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

జంగారెడ్డిగూడెం: మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయినా… ఐదుగురికి కొత్త జీవితం, నలుగురికి చూపు ఇచ్చి అమరురాలైన ఒక మహిళ కథ హృదయాలను కదిలిస్తోంది. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది.

పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ ఈ నెల 8న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితిని గమనించిన భర్త వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. అయితే ఉరి బిగుసుకుపోవడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇక ఆ విషాదంలోనూ మానవత్వం వెలిగింది. తల్లిదండ్రులు డొంకిన సత్యనారాయణ–రాధా దంపతులు, భర్త దుర్గారావు, బంధువులు కలిసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు — మధుశ్రీ అవయవాలను దానం చేయాలని. గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రి వైద్య బృందంతో కలిసి పరీక్షలు నిర్వహించగా, 16వ తేదీన అధికారికంగా బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.

అనంతరం ఆమె అవయవాలను అవసరమైన రోగులకు అమర్చారు. ఊపిరితిత్తులు చెన్నైలోని ఆసుపత్రికి, లివర్ మరియు మూత్రపిండాలు గన్నవరం, గుంటూరులోని ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అమర్చి కొత్త జీవితం అందించారు. అలాగే నేత్రదానం ద్వారా నలుగురికి చూపు ప్రసాదించారు.

ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మధుశ్రీ మృతదేహానికి గౌరవ వందనం సమర్పించారు. తహసీల్దార్, పోలీసు అధికారులు కూడా నివాళులు అర్పించారు.

“తాము తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ మరొకరికి ప్రాణదానం చేయాలని ముందుకు వచ్చిన ఈ కుటుంబం నిజంగా గొప్పది” అని పలువురు అభినందించారు.

మధుశ్రీ భర్త దుర్గారావు, కుమారుడు బన్విత్ (5), కుమార్తె త్రిషిక (2.9)తో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరణానంతరం కూడా ఐదుగురిలో జీవిస్తూ… నలుగురి కళ్లలో వెలుగై నిలిచిన మధుశ్రీకి సమాజం కృతజ్ఞతలు తెలుపుతోంది.

Sthanikam

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ… నలుగురికి వెలుగులు! వివాహిత ఆత్మహత్య కథనం హృదయ విదారకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News