Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:24 AM

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,ఎమ్మెల్యే సంజీవరెడ్డి

11-05-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ పట్నే నాగనాథ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి వారి నివాసానికి చేరుకొని పట్నే నాగనాథ్ భౌతిక దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్నే నాగనాథ్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతతో పనిచేసిన నాయకుడని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తి అని కొనియాడారు. ప్రజలతో మమేకమై పనిచేసిన మంచి నాయకుడిని కోల్పోవడం పార్టీకి, ప్రాంత ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కంగ్టి మండల ప్రజలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని పట్నే నాగనాథ్‌కు కన్నీటి నివాళులు అర్పించారు.

Sthanikam

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News