Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

ఆస్క్ ఉచిత పాలిటెక్నిక్,టిజి ఆర్జెసి కోచింగ్ ప్రారంభం

15-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

విద్యా మూలాలను సమాజంలోకి పంపించాలనే ఉద్దేశమే ఆస్క్ లక్ష్యం

ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

ఆస్క్ అధ్యక్షులు బల్గూరి స్నేహ దుర్గయ్య

విద్యా మూలాలను సమాజంలోకి పంపించాలనే ఉద్దేశమే ఆస్క్ లక్ష్యం అని ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్ ) ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్, టీజీ ఆర్జెసి కోచింగ్ సెంటర్ ప్రారంభం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెస్ కళాశాల ఆవరణంలో మంగళవారం ఆస్క్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య, ఎమ్మెస్ కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, షేకు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోచింగ్ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన బల్గూరి స్నేహ దుర్గయ్య.అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ ఆస్క్ ఇన్స్టిట్యూట్ ని గత 15 సంవత్సరాలుగా నిర్వీర్యము లేకుండా ఉచిత కోచింగ్ సెంటర్ నడవడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ను ఉపయోగించుకొని మంచి ర్యాంకులు సాధించి కళాశాలలో సీటు సంపాదించుకోవాలని కోరారు. అనంతరం ఆస్క్ అధ్యక్షురాలు స్నేహ దుర్గయ్య జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఆస్క్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

బల్గూరి దుర్గయ్య, మాతంగి ప్రభాకర్ రావు, యలమర్తి శౌరి, పులి వెంకటేశ్వర్లు, బొడ్డు .హుస్సేన్, కాసాని శ్రీనివాస్ గౌడ్, కుడుముల స్వామి దాసు,శ్రీనివాస్ రెడ్డి, నందిపాటి .సైదులు, అమరబోయిన వెంకటరత్నం, చేకూరి రమేష్, మేళ్లచెరువు వీరభద్రం, గంధం బుచ్చారావు, చెరుకుపల్లి కిరణ్, మాతంగి సురేష్, కనుకు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆస్క్ ఉచిత పాలిటెక్నిక్,టిజి ఆర్జెసి కోచింగ్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News