Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:50 AM

ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి సవిత

18-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రివర్యులు సవిత నేడు అనంతపురం పట్టణంలోని సాయి నగర్ రెండవ క్రాస్‌లో పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు చంద్రకాంతమ్మ గారి కుమారుడు లికిత్ రామ్ ప్రారంభించిన ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించారు.

ఇటీవల ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మంత్రి సవిత పరిశీలించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన ఆర్థో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన మంత్రి సవిత రోగులకు సేవాభావంతో వైద్యం అందించాలని సూచించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన చికిత్స అందిస్తూ ఆరోగ్య సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి సవిత

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రివర్యులు సవిత నేడు అనంతపురం పట్టణంలోని సాయి నగర్ రెండవ క్రాస్‌లో పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు చంద్రకాంతమ్మ గారి కుమారుడు లికిత్ రామ్ ప్రారంభించిన ఆర్థో సూపర్ స్పెషాలిటీ సెంటర్‌ను సందర్శించారు.

ఇటీవల ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను మంత్రి సవిత పరిశీలించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన ఆర్థో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన మంత్రి సవిత రోగులకు సేవాభావంతో వైద్యం అందించాలని సూచించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన చికిత్స అందిస్తూ ఆరోగ్య సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News