Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

ఆర్టీసీకి శుభవార్త.. నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం

29-04-2026 218 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విలీనం దిశగా ఆర్టీసీ.. రామన్నపేటలో సంబరాలు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు స్పందనగా రామన్నపేటలో సంబరాలు నెలకొన్నాయి. మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఆర్టీసీ కార్మికులకు 10 శాతం పీఆర్సీ, ప్రభుత్వంలో విలీనం, సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి నిర్ణయాలు కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుతూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మండల అధ్యక్షుడు బట్టే సంతోష్ కుమార్ మాట్లాడుతూ, కార్మికుల చిరకాల డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నిర్ణయాలు వారికి పెద్ద ఊరటనిచ్చాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పున్న అమరేందర్, గురిజాల మహేష్ రెడ్డి, కల్లూరి శివ, మేకల జలేందర్, జవ్వాజి శ్రీకాంత్, కందుల సాయిరాం, సింగరాజు సుమంత్, కేశవదాసు ఉదయ్, మొహమ్మద్ అజార్, కొండా సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీకి శుభవార్త.. నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News