Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

ఆర్టీసీ ఉద్యోగుల సహజ మరణానికీ యూబీఐ రూ. 10 లక్షల బీమా

08-04-2026 308 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది.రూ. 10 లక్షల ఆర్థిక భరోసా: యూనియన్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా, వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది ఏప్రిల్ 1 నుండి అమలు: ఈ నూతన నిబంధన 2026, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది ఉచిత బీమా: ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా బ్యాంకే భరిస్తుంది.

అదనపు ప్రయోజనాలు: గతంలో ఉన్న రూ. 1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతూనే, ఈ సహజ మరణ బీమా అదనంగా చేరింది.

ఎండీ . వై.నాగిరెడ్డి చేసిన ప్రత్యేక సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38వేల పైగా ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప ఆర్థిక భరోసా లభించనుంది.

Sthanikam

ఆర్టీసీ ఉద్యోగుల సహజ మరణానికీ యూబీఐ రూ. 10 లక్షల బీమా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News