Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

ఆర్టీసీ ద్వారా ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు

09-03-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

సికింద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా భక్తులకు భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు సులభంగా అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ డిపోలో తలంబ్రాల బుకింగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను డిపో మేనేజర్ సుధాకర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తులకు తలంబ్రాలను నేరుగా ఇంటి వద్దకే చేర్చే విధంగా ఆర్టీసీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

తలంబ్రాల బుకింగ్ కోసం కంటోన్మెంట్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ను 9154298820, 9154298831, 9154298863 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి కృష్ణ, రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ బాలరాజ్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ ద్వారా ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News