Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:57 PM

అనుదీప్ మృతిపై నిష్పక్షపాత విచారణకు మంత్రి పార్థసారధి ఆదేశాలు – కుటుంబానికి అండగా టిడిపి మండల పార్టీ, మందపాటి బసవా రెడ్డి, ఇజ్జి గాని వెంకటేశ్వరరావు

అనుదీప్ మృతిపై నిష్పక్షపాత విచారణకు మంత్రి పార్థసారధి ఆదేశాలు – కుటుంబానికి అండగా టిడిపి మండల పార్టీ, మందపాటి బసవా రెడ్డి, ఇజ్జి గాని వెంకటేశ్వరరావు

అనుదీప్ మృతిపై నిష్పక్షపాత విచారణకు మంత్రి పార్థసారధి ఆదేశాలు – కుటుంబానికి అండగా టిడిపి మండల పార్టీ, మందపాటి బసవా రెడ్డి, ఇజ్జి గాని వెంకటేశ్వరరావు
March 15, 2026 10:02 AM 314 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని దీప చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అంబటి అనుదీప్ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మందపాటి బసవారెడ్డి తెలిపారు. మృతుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ మండల కమిటీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బసవారెడ్డి మాట్లాడుతూ యువకుడు అనుదీప్ మృతి అనుమానాస్పదంగా జరిగిందని చెప్పడానికి పలు కారణాలు ఉన్నాయని తెలిపారు. అందువల్లే మంత్రి పార్థసారథికి విన్నవించగా వెంటనే పోలీసులకు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఘటనలో దోషులు తప్పించుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంపై ఎస్పీ, సీఐ లతో కూడా మంత్రి పార్థసారథి మాట్లాడి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఎస్సై రామకృష్ణ రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి దోషులను పట్టుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తెలియజేస్తున్న అనుమానాలను పోలీసులు పరిగణలోకి తీసుకుని సమగ్ర విచారణ జరపాలని పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. నాయకులు మరిడి చిట్టిబాబు మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు అనుదీప్ మరణం తల్లిదండ్రులకు తీరని లోటని అన్నారు. మంత్రి పార్థసారథి ఆదేశాల మేరకు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని, నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని తెలిపారు. మరొక టీడీపీ నేత బొట్టు లక్ష్మణరావు మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. నరసింహారావుపాలెం పీఏసీఎస్ ఛైర్పర్సన్ కట్టా నాగదుర్గారావు మాట్లాడుతూ అనుదీప్ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులు ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరుగొలనుపేట టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య మాట్లాడుతూ యువకుని మృతి బాధాకరమని, తల్లిదండ్రులకు తీరని శోకమని అన్నారు. మృతి పై ఉన్న అనుమానాలు తొందరగా నివృత్తి అయ్యేలా త్వరితగతిన విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు తెలిపారు. టీడీపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తేళ్లూరి శేఖర్ మాట్లాడుతూ మంత్రి పార్థసారథి ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. జనసేన నేత సవరం రామారావు మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్త అనుదీప్ మరణం జనసేన పార్టీకి తీరని లోటని అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నిజమైన జనసేన కార్యకర్తగా ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబటి సత్యనారాయణ, కమ్ముల కొండలరావు, తోటకూర వెంకటేశ్వరరావు, జనసేన నేత కొల్లా శ్రీకాంత్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News