Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:20 PM

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

14-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, అణగారిన వర్గాల పాలిట ఆయన వెన్నంటి ఉండే దేవుడని అన్నారు.​"అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను నేడు మనమందరం అనుభవిస్తున్నాం. ఆయన చూపిన బాటలో నడుస్తూ, ఆ ఆశయాలను ముందు తరాలకు అందించడమే మనం వారికిచ్చే అసలైన నివాళి."​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపల్ మేనేజర్ డి. శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్స్ కొసనం రాకేష్ రెడ్డి​పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఊదరి యాదయ్య, కొయ్యాడ శేఖర్, దేప రమ్య రాజు,బత్తుల జయమ్మ దాసు, గడ్డం ఇందిర రాజరత్నం, చింతల ఉమామహేశ్వరి సాయిలు,బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, నాయకులు ఉడుగు రమేష్, ఆలే చిరంజీవి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News