Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

అక్రెడిటేషన్ కమిటీల నిర్ణయాలపై హైకోర్టు తలుపుతట్టిన టీడబ్ల్యూజేఎఫ్

05-05-2026 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

రాష్ట్రంలో మీడియా అక్రెడిటేషన్ కమిటీల నిర్ణయాలపై వివాదం నెలకొంది. అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర, జిల్లా కమిటీల నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) హైకోర్టును ఆశ్రయించింది.

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌లో, రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)ల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. జీవో 252 ప్రకారం కమిటీలలో నాలుగు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఉండాల్సి ఉండగా, కేవలం మూడు సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చారని, తమ సంఘానికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ఐఅండ్‌పీఆర్ స్పెషల్ కమిషనర్, మీడియా అకాడమీ చైర్మన్‌తో పాటు 33 జిల్లాల ప్రజా సంబంధాల అధికారులను ప్రతివాదులుగా చేర్చారు.

ఇక మరో పిటిషన్‌లో, అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటుకు జారీ చేసిన జీవో ఆర్టీ 229ను రద్దు చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ సభ్యుడు, ఏవీఎన్ టీవీ కరస్పాండెంట్ నంబి పర్వతాలు దాఖలు చేసిన పిటిషన్‌లో, జీవో 252 నిబంధనలకు విరుద్ధంగా జీవో 229 అమలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

కమిటీలలో నాలుగు జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉండగా, మూడు సంఘాలకు మాత్రమే అవకాశం కల్పించడం నిబంధనల ఉల్లంఘన అని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీవో ఆర్టీ 229 అమలను సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరారు.

ఈ రెండు పిటిషన్లపై విచారణకు హైకోర్టు ఎప్పుడు తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.

Sthanikam

అక్రెడిటేషన్ కమిటీల నిర్ణయాలపై హైకోర్టు తలుపుతట్టిన టీడబ్ల్యూజేఎఫ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News