Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:03 AM

ఆక్రమణలతో ఇరుకైన రాఘవపురం–సిరికొండ ప్రధాన రహదారి

26-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వాహనదారులకు ఇబ్బందులు – విద్యార్థుల రవాణాకు ఆటంకం

మోతే మండలంలోని రాఘవపురం ఎక్స్ రోడ్ నుండి సిరికొండకు వెళ్లే ప్రధాన రహదారి ఆక్రమణలతో ఇరుకుగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్గంలో రహదారి పక్కనే ద్విచక్ర వాహనాలు నిలిపివేయడం, చిన్న గుడిసెలు ఏర్పడడంతో దారి వెడల్పు గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా సుమారు యాభై మీటర్ల వెడల్పు ఉండాల్సిన రహదారి ప్రస్తుతం పది మీటర్లకు కూడా తగ్గిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా రావడానికే కష్టంగా మారింది.

ఈ మార్గంలో పాఠశాల బస్సులు వెళ్లే సమయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు అడ్డంగా నిలిపివేయడంతో బస్సు డ్రైవర్లు హారన్ కొట్టినా స్పందించకపోవడం, కొన్ని సందర్భాల్లో వాగ్వాదాలు, దాడుల వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారి ఆక్రమణలను తక్షణమే తొలగించి, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని గ్రామ ప్రజలు, వాహనదారులు గ్రామ కార్యదర్శి సహా సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Sthanikam

ఆక్రమణలతో ఇరుకైన రాఘవపురం–సిరికొండ ప్రధాన రహదారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News