Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 07:35 AM

ఐకేపీ కేంద్రాల్లో అన్నదాతల 'గోస' పట్టించుకోని ప్రభుత్వం.!

11-05-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ భారీ ధర్నా..

వడ్ల కొనుగోళ్లలో అన్యాయాలపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి గర్జన..

జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత 15 రోజుల్లో కొంటామని హామీ..

నల్లగొండ, : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల తీరు అస్తవ్యస్తంగా మారింది. నెల రోజులుగా మండే ఎండల్లో వడ్ల కుప్పల వద్ద రైతన్నలు పడిగాపులు కాస్తున్నా పాలకుల్లో చలనం లేకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన గళం విప్పారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌ను కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

అడుగడుగునా దోపిడీయే...

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలిస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా అయినా, వాటిని మిల్లులకు తరలించడానికి సరిపడా లారీలు లేవని దీంతో వడ్లు రోజుల తరబడి కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. తేమ శాతం సాకుతో క్వింటాకు అడ్డగోలుగా కిలోల కొద్దీ తరుగు తీస్తూ రైతుల నోరు కొడుతున్నారన్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మధ్యవర్తులు, దళారులు రైతులను భయపెట్టి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు పెత్తనం చెలాయిస్తూ సామాన్య రైతును ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఎండలో ఎండుతూ, అకాల వర్షాలకు తడుస్తున్నా.. కనీసం తార్పాలిన్లు, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

అప్పుల ఊబిలో అన్నదాత...

​ధాన్యం కొనుగోలు చేసినా చెల్లింపులు సకాలంలో రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని చిరుమర్తి ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కంటతడి పెడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని హెచ్చరించారు. రాజకీయ జోక్యాన్ని అరికట్టి పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను విన్న జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ.. రాబోయే 15 రోజుల్లోపు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి స్థాయిలో ముగిస్తామని హామీ ఇచ్చారు. లారీల సంఖ్యను పెంచి ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ఐకేపీ కేంద్రాల్లో అన్నదాతల 'గోస' పట్టించుకోని ప్రభుత్వం.!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News