Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:57 AM

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!
05-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

36–40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు – 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుండి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రంలోని 33 జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది. వేడి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకూడదు
  2. ఎక్కువగా నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి
  3. వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  4. ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు విరామాలు తీసుకోవాలి

వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

Sthanikam

ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి..!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News