Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం.....

20-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఫైర్‌ స్టేషన్‌కు నూతన వాహనం అందిస్తాం.... ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి......

విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కార్యాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.కోదాడ ఫైర్ స్టేషన్‌కు త్వరలోనే సరికొత్త ఫైర్ ఇంజిన్ వాహనాన్ని మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సిబ్బంది, బాలాజీ నగర్ ప్రజల కోసం కార్యాలయ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు,జిల్లా ఫైర్ ఆఫీసర్ వై కృష్ణారెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డాక్టర్ బాబు, స్థానిక కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్, చైతన్య నాయక్ మున్సిపల్ కమిషనర్ రమాదేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News