Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:26 PM

ప్రమాదంలో గాయపడిన యువకుడికి ఎమ్మెల్యే వేముల వీరేశం సహాయం

04-05-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో మానవతా దృక్పథానికి నిదర్శనంగా ఒక మంచి ఘటన చోటుచేసుకుంది. పదో వార్డుకు చెందిన బండగోని వెంకట రాములు కుమారుడు శ్రీకర్ ఇటీవల ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

శ్రీకర్ చికిత్స కోసం కౌశిక్ ఆసుపత్రిలో జరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యే రూ.5,000ల ఆర్థిక సాయాన్ని పంపించారు. సోమవారం ఈ మొత్తాన్ని 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ యాదవ్, నాయకులు బొబ్బలి రామ్ రెడ్డి, పాటి దివాకర్ రెడ్డి, సిలువేరు శేఖర్, కంభంపాటి సతీష్, జడల సుమన్ యాదవ్, ఆగు వెంకన్న, దాసరి వెంకటేశం తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు.స్థానికంగా జరిగిన ఈ ఘటనపై ప్రజలు స్పందిస్తూ, అవసర సమయంలో ముందుకు వచ్చి సహాయం చేసిన ఎమ్మెల్యేను అభినందించారు.

Sthanikam

ప్రమాదంలో గాయపడిన యువకుడికి ఎమ్మెల్యే వేముల వీరేశం సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News